ఆనతినీయరా హరా
సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా || ఆనతినీయరా||
నీ ఆన లేనిదే రచింపజాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా
అచలనాధ అర్చింతునురా || ఆనతినీయరా||
జంగమదేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము చేతురా || ఆనతినీయరా||
శంకరా శంకించకుర
వంకజాబిలిని జడను ముడుచుకుని
విషపునాగులను చంకనెత్తుకుని
నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేయిని
నీ కింకనుక సేవించుకుందురా || ఆనతినీయరా||
రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష
నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా || ఆనతినీయరా||
శృతి నీవు
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపధము
నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం
No comments:
Post a Comment