Sunday, October 20, 2013

ఆరడుగుల బుల్లెట్టు


గగనపు వీధి వీధి వలసఎల్లి పోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తనే ఆకాశం పరదేసం శిఖరపు అంచు నుంచి నెల జారి పోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన బాసం వనవాసం ||1|| బైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో ఉక్కు తీగలాంటి వంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైనా తేజం రక్షకుడో భక్షకుడో పరిక్షలకే సుషిఖితుడో శత్రువు అంటూ లేని వింత యుద్ధం వీడి గుండె లోతు గాయమైన సిద్దం నడిచొచ్చే నర్తన శౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హాలాహలం హరించిన గంగ హృదయుడో వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు ||1|| గగనపు వీధి ||2|| దివి నుంచి బువి పైకి భగ భగ మని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వడివడిగా వడగల్లె దడ దడమని జారేటి కనిపించని జడి వానేగా వీడు శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు శోకాన్నే దాచేసే అశోకుడు వీడురో వీడు ఆరడుగుల ||2|| తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు పామరుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో సైనికుదో శ్రామికుడో అసాద్యుడు వీడురో వీడు ఆరడుగుల ||3|| గగనపు వీధి ||3||

Namo Narayanaya Namo - Balakrishna Prasad


Wednesday, May 15, 2013

Siri Vennala


నీ పయనం ఎక్కడికో

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ||ఛలోరే ||                  


చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ ||ఛలోరే ||


సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ ||ఛలోరే ||


నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ||ఛలోరే ||


ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే ||ఛలోరే ||


అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం ||ఛలోరే ||


రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం ||ఛలోరే ||


తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం ||ఛలోరే ||

చుక్కల్లారా చూపుల్లారా

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
విన్నవించరా వెండిమింటికి
జోజో లాలి జోజో లాలి
జోజో లాలి జోజో లాలి

మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే
నిదురమ్మా ఎటుబోతివే
మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే
కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటుబోతివే
కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే
గువ్వల రెక్కలపైనా రివ్వూరివ్వున రావే
జోలపాడవా బేలకళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో లాలి జోజో లాలి

పట్టుపరుపులేల పండువెన్నెలేల
అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి
పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేల నాదబ్రహ్మలేల
అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్నిచిన్ని కన్నుల్లో ఎన్నివేల వెన్నెల్లో
తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో
అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు అంతులేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యాడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల
జాడచెప్పరా చిట్టితల్లికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో లాలి జోజో లాలి

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి

ఔరా అమ్మకచెల్ల

అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు జాడలేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యేడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల

ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీలా
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణజానపదాలతో ఙానగీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఆలమందకాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాల
తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

నిగ్గదీసి అడుగు

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

ఉప్పొంగెలే గోదావరి


షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ||ఉప్పొంగెలే ||

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాగా  ||ఉప్పొంగెలే ||

గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా ||ఉప్పొంగెలే ||

నువ్వు నువ్వు

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు
నా మెడ వంపున నువ్వు
నా గుండె మీద నువ్వు
ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు
ముద్దేసే నువ్వు
నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు
ప్రతి నిమిషం నువ్వు

నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు
నా సైన్యం నువ్వు
నా ప్రియ శతృవు నువ్వు
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు

నా సిగ్గుని దాచుకునే కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితొ నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వు
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు నువ్వు

మైమరపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకేతెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వు
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వు

Oh my friend

పాదమెటు పోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా
చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోన నేను లేనా
ఒంటరైనా ఓటమైనా
వెంటనడిచే నీడవేనా
Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది
జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది
మీరు మీరు నించి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే
మోమటాలే లేని కళే జాలువారే
ఒంటరైనా ఓటమైనా
వెంటనడిచే నీడనీవే
Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

వానవస్తే కాగితాలే పడవలయ్యే ఙాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూతుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే
ఒంటరైనా ఓటమైనా
వెంటనడిచే నీడనీదే
Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

అనగనగా ఆకాశం ఉంది

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టాయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

ఊగే కొమ్మల్లోన చిరుగాలి ఖవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వింతగా
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువు చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి

చుక్కల్లోకం చుట్టు తిరగాలి అనుకుంటు ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటు ఓ తార నాకోసం వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశలని పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి

సిందూరం

అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరేతెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!






ఎవ్వరినెప్పుడు

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థంకాని పుస్తకమే ఐనాగని ఈ ప్రేమ
జీవిత పరమార్థంతానే అనిపిస్తుందీ ఈ ప్రేమ

ఎన్నెన్నెనో రంగులతో కనిపిస్తుందీ ఈ ప్రేమ
రంగులకలలే కాంతి అనీ నమ్మిస్తుందీ ఈ ప్రేమ
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణం కాదీప్రేమ
తెల్లని సత్యం కల్ల అనీ ప్రకటిస్తుందీ ఈ ప్రేమ

లైలామజ్ను గాథలని చదివిస్తుందీ ఈ ప్రేమ
తాజ్ మహల్ తన కోట అనీ చూపిస్తుందీ ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమ
కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ

అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమ
జరిగే మథనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమ
ఔనంటూ కాదంటూనే మదిని మథించే ఈ ప్రేమ
హాలాహలమే గెలవండీ చూద్దామంటుందీప్రేమ

ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఓక జంటతో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ
సీతారాములనేమార్చే మాయలేడి కద ఈ ప్రేమ
ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లని

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి







నీ ప్రశ్నలు నీవే


నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా
వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేవా

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగ
ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా

ఆనతినీయరా హరా


ఆనతినీయరా హరా
సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరాసన్నిధిజేరగా || ఆనతినీయరా||


నీ ఆన లేనిదే రచింపజాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా
అచలనాధ అర్చింతునురా || ఆనతినీయరా||


జంగమదేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము చేతురా || ఆనతినీయరా||


శంకరా శంకించకుర
వంకజాబిలిని జడను ముడుచుకుని
విషపునాగులను చంకనెత్తుకుని
నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేయిని
నీ కింకనుక సేవించుకుందురా || ఆనతినీయరా||


రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష
నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా || ఆనతినీయరా||


శృతి నీవు

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపధము
నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం