My favorite bhajan, by the mellifluous Jagjit Singh
సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే హే భారతీ మనసా స్మరామి శ్రీ భారతీ శిరసా నమామి
Friday, March 26, 2010
Gathulanni - Annamacharya
Excellent Song. Great Contribution by BKP and his son. The best rendition of this song!
Thursday, March 25, 2010
ఒక రాజకీయ ఉత్తరం
ఒక రాజకీయ ఉత్తరం
రచన: మహెజబీన్
(మహె జబీన్ గారి కవితలు “ఆకురాలు కాలం” సంకలనంగానూ, ఆ తర్వాత వివిధ పత్రికల్లోనూ వెలువడి ఎంతగానో ప్రశంసించ బడ్డాయి. మహె జబీన్ కవయిత్రి గానే కాకుండా సాంఘిక సంక్షేమ కార్యకర్తగా కూడా ఎంతో దీక్షతో పనిచేస్తున్నారు.)
నేనేం చేయను బాలగోపాల్
నా కొడుకు మాట వినడం లేదు
బ్రతికే ప్రాధమిక హక్కుపై
వాడికి పెద్ద మమకారం లేదు గాని
మాట్లాడుతూ బ్రతికే మనిషి
గాయపడటం భరించలేక పోతున్నాడు
“మనకు పౌరసత్వం లేదు
పౌరహక్కులు లేవు
ఎలాగో ఒకలా బతికేద్దాం
కుక్కలు పందులతో పాటు మైనారిటీలురా” అన్నాను
“మాట్లాడకురా ఉద్యమం మాటెత్తకురా
మానవహక్కులు మరిచిపోరా”
ఎంతెంతో చెప్పాను
ఎన్నోసార్లు చెప్పాను
“మాట్లాడితే నడిరోడ్డు మీద నరికేస్తారురా”
భయపెట్టాను
“ఒక్కగానొక్క కొడుకువిరా”
sentiment తో ప్రయత్నించాను
కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను
నవమాసాలు మోసిన సంగతి
తొమ్మిదిసార్లు గుర్తుచేసాను
వింటేగా
మాట్లాడటానికి ఎన్నిలేవు ప్రపంచంలో
రాజకీయాలు కుంభకోణాలు సినిమాలు
ఎన్నికలు వాగ్దానాలు కంప్యూటర్లు
చివరికి telephone sex talks
ఇవన్నీ వదిలేసి
పౌరహక్కులు అంటాడేంటి
వీడికి పిచ్చిగాని పట్టిందా
ఇదంతా నీవల్లే జరిగింది బాలగోపాల్
నీరాతలు మాటలతో వాడిలా అయ్యాడు
అక్కడ రాలిపడ్డ రక్తపు చుక్కలు
లెక్కపెట్టుకు రమ్మంటున్నాడు
నేనేం చేయను వాణ్ణి వదులుకోలేను
నా కొడుకు ఎంచుకున్న దారే నాదారి
ముద్దుగారే యశోద
ముద్దుగారే యశోద
రాగం: ఖురింజి
29 శంకరాభరణం జన్య
అన్నమాచార్య కృతి
పల్లవి
ముద్దుగారె యశోదా ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు
చరణం 1
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడె కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ష్ష్ణుడు
చరణం 2
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేదికము
సతమ్యె శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచె కమలాక్షుడు
చరణం 3
కాళింగుని తలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె దిరిగె పద్మనాభుడు
రాగం: ఖురింజి
29 శంకరాభరణం జన్య
అన్నమాచార్య కృతి
పల్లవి
ముద్దుగారె యశోదా ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు
చరణం 1
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడె కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ష్ష్ణుడు
చరణం 2
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేదికము
సతమ్యె శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచె కమలాక్షుడు
చరణం 3
కాళింగుని తలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె దిరిగె పద్మనాభుడు
శ్రుతి నీవు గతి నీవు
శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి || ||
నీ పదములొత్తిన పథము ఈ పథము నిత్యకైవల్యపథము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్గ నిథులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నినుకొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్యసన్నిధి తప్ప || ||
శ్రీనాధ కవినాధ శృంగార కవిత తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంతరాగాలు నీ మూర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం || ||

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య
రచన : వైదేహి శశిధర్
అసహనం నీ అరచేతిలో రిమోట్‌లా ఒదిగి
ఆలోచనల ఛానెళ్ళను అస్తవ్యస్తంగా మారుస్తుంది
పరధ్యానం నా పుస్తకంలో తల దాచుకుని
అన్యమనస్కంగా పేజీలు తిరగేస్తుంది
లివింగ్ రూం సోఫాలో టివి ముందు నువ్వు
లైబ్రరీలో మెడికల్ జర్నల్‌తో నేను
భరించలేని ఈ నిశ్శబ్దపు అగాధాన్ని
బింకంగా దాటే ఉపాయం కోసం
ఎవరికి వారే వెతుక్కుంటూ ఉంటాము
ఏ చిన్ని కలహమైతే మన మధ్య కోటగోడలా నిల్చి
మన మాటలు మనకే వినబడకుండా చేసిందో
ఆ కోటగోడని నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
నెమ్మది నెమ్మదిగా కరిగించి వేస్తుంది
ఎప్పటి లాగా ఈ రోజు చిరునవ్వుల విరజాజులు
నులివెచ్చని పరామర్శలు మనల్ని స్పర్శించక పోయినా
సంక్షిప్తమైన మన చూపుల్ని కలుపుతూ
ఏటవాలుగా విరియటానికి ఓ ఇంద్రధనుస్సు
ఆరాటపడుతూనే ఉంటుంది
నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ
నీవు చెప్పలేనివన్నీ నాకు
గుసగుసగా వినిపించేసి
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
మూగబోయిన వాయిద్యమై మెరుస్తుంది
అంచెలంచెలుగా సాగిన జుగల్బందీలో
రసాత్మకమైన రాగాన్ని ఆలపించి
విశ్రాంతి తీసుకుంటున్న సహ గాయకుల్లా
కరిగిన గోడల మధ్య చెదిరిన మేఘాల క్రింద
మనిద్దరం మౌనంగా మిగిలిపోతాము
ఎందుకో ఒక్కోసారి
నీతో మాట్లాడకపోయినా
మాట్లాడుతున్నట్లే ఉంటుంది
(యండమూరికి కృతజ్ఞతలతో)
వేటూరి!
ఇలపావులూరి
ఆ తరువాత వచ్చిన కవులు, మాటల కవులు పాటల కవులు గా విడివడి రచనలు సాగించడం మొదలయ్యింది. అదే సమయంలో తెలుగు సినిమాకు చిలకపచ్చ చీర కట్టి, తరువాత్తరువాత ఆ చీరకొంగే లాగి చిలిపి ఆటలు ఆడిన ఉద్దండపిండం, కొంటెకోదండం ఒకాయన రంగప్రవేశం చేశారు.
ఆయనే వేటూరి!
తొలుత దైతాగోపాలం గారివద్ద, ఆ తర్వాత మల్లాది గారి వద్ద శిష్యరికం చేసి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు తీయించారు శ్రీ వేటూరి గారు.
సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి కొండొకచో సంగ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, ఇలా ఎన్నో సినిమాలు! “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు, అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ”, “ఉఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు; స్పందించు నవనాడులే వీణాగానాలు; నడలు ఎదలోని సడులే మృదంగాలు” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. గీతరచనకు కేంద్ర ప్రభుత్వం చేత అవార్డును పొందిన ఏకైక తెలుగు సినిమాకవి ఆయన. సీతారామశాస్త్రి వచ్చేవరకూ వేటూరిది దాదాపు ఏకచత్రాధిపత్యం అనే చెప్పుకోవచ్చు.
ఆల్కెమీ అంటే రసవాదం లేదా పరుసవేది. అంటే కొన్ని సాధారణమైన వస్తువుల కలయికతో బంగారాన్ని పుట్టించడం. ఏది ఇంగిలీకమో, ఏది పాదరసమో, ఏది వెలిగారమో, ఏది పాముకుబుసమో, ఎరిగి, సమపాళ్ళలో కలిపి, స్వర్ణతుల్యమైన పాటల్ని ఒడుపుగా పుట్టించిన చెంబోలు సీతారామశాస్త్రి ఒక్క సినిమాతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడిపోయారు. ఉదాత్తమైన భావాలూ శక్తివంతమైన పదాల్తో సున్నితమైన సులభగ్రాహ్యమైన పాటల్ని వ్రాయడంలో ఆయనకాయనే సాటి.
వీళ్ళు మాత్రమే కాక “కురిసింది వాన నా గుండెలోన” అంటూ రాజశ్రీ, “తనువా హరిచందనమే” అంటూ విజయరత్నం, “ఓహో గులాబిబాల” అని అనిశెట్టి, “నిదురపోరా తమ్ముడా” అని పినిశెట్టి, “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అని గుంటూరు శేషేంద్ర శర్మ ఇంకా వీటూరి, మల్లెమాల, కాటూరి, జాలాది, దాసం గోపాలకృష్ణ, దాసరి నారాయణ రావు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, సామవేదం షణ్ముఖ శర్మ, భువన చంద్ర, చంద్రబోస్, గురుచరణ్ ఇలా ఎందరో శబ్ద స్రష్ఠలు తెలుగు పాటను పెంచి పోషిస్తూన్న పద పరబ్రహ్మలు.
సినిమా సంగీతానికున్న (వుండాల్సిన) ఒకే ఒక్క గుణం సౌలభ్యం. ఏనాటికీ చెడని సౌలభ్యం. వి.ఎ.కె.రంగారావు గారి మాటల్లో చెప్పాలంటే “దారిని పోయే దానయ్యను సైతం గానయ్యను చేసే” సౌలభ్యం. పాట సాహిత్యం విన్న వెంటనే అర్ధం అయినా కాకపోయినా, సంగీతానికి అనుగుణంగా దాని పదసంచారం ఉన్నంతకాలం, తెలుగు శ్రోతలు వుంటూనేవుంటారు వింటూనేవుంటారు.